సిట్ నోటీసులు రద్దు చేయాలంటూ హైకోర్ట్ కు బీఎల్ సంతోష్

సిట్ నోటీసులు రద్దు చేయాలంటూ హైకోర్ట్ కు బీఎల్ సంతోష్

ఫాంహౌస్ కేసులో సిట్ నోటీసులపై బీజేపీ నేషనల్ ఆర్గనైజింగ్  సెక్రటరీ బీఎల్ సంతోష్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు . 41A సీఆర్పీసీ కింద రేపు విచారణకు రావాలని బీఎల్ సంతోష్ కు సిట్ నోటీసులు ఇచ్చింది. ఆ నోటీసులను రద్దు చేయాలని.. లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. ఆయన వేసిన పిటిషన్ పై కాసేపట్లో హైకోర్టులో విచారణ జరగనుంది. బీఎల్ సంతోష్ తరఫున సీనియర్ లాయర్ ప్రకాశ్ రెడ్డి వానదలు వినిపించనున్నారు.

ఫాంహౌస్ ఎమ్మెల్యేల కేసులో నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే నిందితుల బెయిల్ పిటిషన్ ను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేసింది. ఏసీబీ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టును నిందితులు రామచంద్ర భారతి, సింహయాజి, నందకుమార్ ఆశ్రయించారు. నిందితులకు బెయిల్ పిటిషన్ వేసుకునే స్వేచ్ఛ ఉందని, ఇప్పటికే సుప్రీం కోర్టు కామెంట్ చేసింది. తామైతే బెయిల్ ఇచ్చేవాళ్లమని సుప్రీం తెలిపింది. అయితే కిందికోర్టులోనే బెయిల్ తెచ్చుకోవాలని సూచించింది. ముగ్గురు నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై రేపు హైకోర్టు విచారించనుంది.