జూనియర్ ఎన్టీఆర్ కారుకు బ్లాక్ ఫిలిం తొలగింపు

జూనియర్ ఎన్టీఆర్ కారుకు బ్లాక్ ఫిలిం తొలగింపు

హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ కారు అద్దాలకు బ్లాక్ ఫిలింను ట్రాఫిక్ పోలీసులు తొలగించారు. పోలీసులు తనిఖీ చేసిన సమయంలో కారులో ఎన్టీఆర్ తనయుడు, మరో వ్యక్తి, డ్రైవర్ మాత్రమే ఉన్నట్లు సమాచారం. జూబ్లీహిల్స్ కారు ప్రమాదం ఘటన నేపథ్యంలో పోలీసులు వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. పోలీస్, ప్రెస్, ఆర్మీ, ఎమ్మెల్యే, ఎంపీ స్టిక్కర్లతో తిరిగితే కఠిన చర్యలుంటాయని ప్రకటించిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు రెండు రోజులుగా తనిఖీలు ముమ్మరం చేశారు. నిన్న ఆదివారం జూబ్లిహిల్స్ చెక్ పోస్టు వద్ద తనిఖీలు చేస్తుండగా జూనియర్ ఎన్టీఆర్ కు చెందిన కారును ట్రాఫిక్ పోలీసులు ఆపారు. కారు అద్దాలకు బ్లాక్ ఫిలిం ఉండడం నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. 
జడ్‌ప్లస్‌ కేటగిరి భద్రత ఉన్న వారు తప్ప ఇతరులెవరూ వాహనాలపై బ్లాక్‌ ఫిల్మ్‌ వాడేందుకు అనుమతి లేదని తెలియజేశారు. మరికొన్ని వామనాలకు ఎమ్మెల్యే పేరుతో ఉన్న స్టిక్కర్లను తొలగించారు. అలాగే నెంబర్ ప్లేటు సరిగా లేని వాహనాలకు మొదటి తప్పుగా జరిమానా విధించారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం వాహనం లోపల విజిబులిటీ సరిగా ఉండాలని, వాహనాలపై అనుమతి లేకుండా బ్లాక్‌ ఫిల్మ్‌ వేయొద్దని హెచ్చరించారు పోలీసులు. ఈ స్పెషల్ డ్రైవ్ రెండు రోజులపాటు కొనసాగనుంది. 

 

ఇవి కూడా చదవండి

వయసు మీద పడిందని కలలు కనడం మానొద్దు

ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకోవాలె