బ్లాక్​ ఫంగస్​ కూడా ఆరోగ్యశ్రీలో చేర్చిన ఏపీ ప్రభుత్వం

బ్లాక్​ ఫంగస్​ కూడా ఆరోగ్యశ్రీలో చేర్చిన ఏపీ ప్రభుత్వం
  • ఏపీ సర్కారు కీలక నిర్ణయం
  • ఏపీలో ఆరోగ్యశ్రీలోకి బ్లాక్‌ ఫంగస్‌ ట్రీట్‌మెంట్‌

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కరోనా ట్రీట్‌మెంట్‌ను ఆరోగ్యశ్రీలో చేర్చిన జగన్‌ ప్రభుత్వం.. తాజాగా బ్లాక్‌ ఫంగస్‌నూ చేర్చాలని నిర్ణయించింది. ఈ మేరకు వివరాలను ఆరోగ్య మంత్రి ఆళ్ల నాని సోమవారం వెల్లడించారు. ‘బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని సీఎం జగన్ ఆదేశించారు. కరోనాతో తల్లిదండ్రులు చనిపోతే వారి పిల్లలను ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పారు. ఆ పిల్లలకు ఆర్థికసహాయంపై కార్యాచరణ రూపొందించాలన్నారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో పకడ్బందీగా ఫీవర్‌ సర్వే చేస్తున్నాం’ అన్నారు. కాగా, తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల పేరు మీద రూ.10 లక్షలు డిపాజిట్‌ చేసి దానిపై వచ్చే వడ్డీని ప్రతి నెలా పిల్లలకు అందజేసేలా ప్లాన్‌ రూపొందిస్తున్నామని ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఏకే సింఘాల్ చెప్పారు. పిల్లలకు 25 ఏళ్లు వచ్చిన తర్వాత డబ్బు విత్‌డ్రా చేసుకునే అవకాశముంటుందన్నారు.