బ్లాక్ ఫంగస్ బాధితులకు చికిత్స ఈ హాస్పిటల్స్ లోనే..

బ్లాక్ ఫంగస్ బాధితులకు చికిత్స ఈ హాస్పిటల్స్ లోనే..

హైద‌రాబాద్: కోవిడ్ నుంచి కోలుకున్న కొన్ని కేసుల్లో బ్లాక్ ఫంగస్ సమస్య ఉంద‌ని తెలిపింది డిఎంఈ. బ్లాక్ ఫంగస్ భారిన పడితున్న వారిలో ఎక్కువగా ఈఎన్ టి సమస్యలు ఉన్నాయ‌ని..ఈ క్ర‌మంలోనే ఈఎన్ టి హాస్పిట‌ల్ ను నోడల్ కేంద్రంగా సర్కారు ప్ర‌క‌టించిన‌ట్లు చెప్పింది. బ్లాక్ ఫంగస్ భారిన పడి, కోవిడ్ పాజిటివ్ గా ఉన్న వారికి గాంధీలో చికిత్స అందించ‌నున్న‌ట్లు తెలిపింది. బ్లాక్ ఫంగస్ భారిన పడ్డ‌వారు ఆప్తల్మాలజీ డాక్ట‌ర్ అసవరం ఉంటే, సరోజిని దేవి ఆసుపత్రిలో సేవలు వినియోగించనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు గాంధీ, సరోజిని దేవి,  కోటి ఈ ఎన్ టి  ఆస్పత్రుల సుపరిండెంట్ లు తగిన ఏర్పాట్లు చేయాలని  సర్కారు ఆదేశించింది.  బ్లాక్ ఫంగస్ కి వినియోగించే మందులు సమకూర్చాలని టిఎస్ఎంఐడిసికి సర్కారు ఆదేశాలు జారీ చేసింది. బ్లాక్ ఫంగస్ కేసులకు పూర్తిగా కోటి ఈఎన్ టిలో చికిత్స అందిస్తున్న‌ట్లు తెలిపిన డీఎంఈ.. కోవిడ్ పాజిటివ్ గా ఉండి బ్లాక్ ఫంగస్ సమస్య ఉన్న వారికి ప్ర‌త్యేక‌ గదిలో ట్రీట్ మెంట్ ఉంటుంద‌ని తెలిపింది.

ప్రైవేట్ హాస్పిట‌ల్స్ కేర్ తీసుకోవాలి

 క‌రోనా సమయంలో బ్లాక్ ఫంగస్ రాకుండా ప్రైవేట్ హాస్పిట‌ల్స్  స్పెష‌ల్ కేర్ తీసుకోవాల‌న్నారు డీహెచ్ శ్రీనివాస‌రావు. ఈ మేర‌కు శ‌నివారం ఆయ‌న  ప్రైవేట్ ఆస్పత్రులకు ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్ భారిన పడిన కొందరిలో బ్లాక్ ఫంగస్ సమస్యను గుర్తించినట్టు ప్రకటించిన సిహెచ్ శ్రీనివాస రావు.. కోవిడ్ రోగులకు చికిత్స అందించే సమయంలో షుగర్ లెవల్ ని సరిగా అదుపు చేయాలని డాక్ట‌ర్లకు సూచించారు. షుగర్ లెవల్ ని కంట్రోల్ చేసేందుకే అవసరమైతే స్టిరాయిడ్ లను వాడాలన్నారు. యాంటి ఫంగల్, యాంటీ బియోటిక్ మందులు కూడా వాడాలని ఆదేశాలిచ్చారు  డిహెచ్ శ్రీనివాస‌రావు.