నల్ల గుట్ట జే బ్లాక్ లోని ఓ ఇంట్లో బ్లాస్టింగ్

నల్ల గుట్ట జే బ్లాక్ లోని ఓ ఇంట్లో బ్లాస్టింగ్

సికింద్రాబాద్ లోని రాంగోపాల్ పేట పోలీస్ స్టేషన్ నల్ల గుట్ట జే బ్లాక్ లోని ఓ ఇంట్లో బ్లాస్టింగ్ జరిగింది. ఆ ఇంట్లో ఉంటున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వెంటనే స్పందించిన స్థానికులు కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ బ్లాస్టింగ్ కు కారణం ముందు అంతా ఉంట్లో ఉన్న సిలిండరే అనుకున్నారు. కానీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆ సిలిండర్ బాగానే ఉన్నట్టు నిర్ధారించారు. ఇక ఈ పేలుడు దాటికి మొదటి అంతస్తు తీవ్రంగా దెబ్బతిన్నది. దాంతో పాటు చుట్టపక్కన ఉన్న కొన్ని ఇండ్లు కూడా దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. ఈ కేసులో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.