కూకట్‌పల్లి, వెలుగు: గేటెడ్ కమ్యూనిటీలో నిబంధనల ప్రకారం అనుమతి తీసుకోవాలని కోరినందుకు డెలివరీ బాయ్స్ సెక్యూరిటీ గార్డ్స్‌పై దాడికి పాల్పడ్డారు.ఈ ఘటన కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. శనివారం రాత్రి ‘బ్లింకిట్’ డెలివరీ బాయ్ రెయిన్‌బో విస్టా అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అనుమతి తీసుకోవాలని గార్డులు చెప్పడంతో ఆగ్రహించిన అతడు తన సహచరులను పిలిపించి గార్డ్స్‌పై దాడి చేశాడు. ఈ ఘటనలో ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్‌కు గాయాలయ్యాయి. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
