నేడు ఆకాశంలో సూపర్ బ్లడ్ మూన్‌గా చంద్రుడు

నేడు ఆకాశంలో సూపర్ బ్లడ్ మూన్‌గా చంద్రుడు

ఆకాశంలో ఇవాళ అద్బుతం జరగనుంది. సంపూర్ణ చంద్రగ్రహణం కనువిందు చేయనుంది. ఇండియాలో పాక్షికంగానే కనిపించే ఈ గ్రహణానికి ఓ ప్రత్యేకత ఉంది.  చంద్రుడు ఇవాళ సూపర్ బ్లడ్ మూన్‌గా దర్శనమివ్వనున్నాడు. అయితే భారత్‌లోని అన్ని ప్రాంతాల ప్రజలు దీనిని డైరెక్ట్‌గా చూసే అవకాశం లేదు. ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాలు, ఒడిశా తీరప్రాంతాలు, అండమాన్, నికోబార్ దీవుల్లో ఈ గ్రహణం దర్శనమివ్వనుంది. 

భారత కాలమాణ ప్రకారం చంద్రగ్రహణం మధ్యాహ్నం 3.15 గంటలకు మొదలై సాయంత్రం 6.23 గంటలకు ముగుస్తోంది. నాసా ప్రకారం.. అమెరికా, కెనడా, మెక్సికో, సెంట్రల్ అమెరికాలోని చాలా ప్రాంతాలు, అర్జెంటినా దేశాల్లో పూర్తి గ్రహణం కనిపించనుంది. గ్రహణ సమయంలో చంద్రుడు ఎర్రగా మారనున్నాడు. దీన్ని సూపర్ బ్లడ్ మూన్‌గా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. 

కాగా.. ఈ ఏడాది నాలుగు గ్రహాణాలు సంభవించనున్నాయి. ఇందులో రెండు సూర్య గ్రహణలు, మరో రెండు చంద్ర గ్రహణాలు ఉన్నాయి. ఇవాళ సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుండగా.. జూన్ 10న పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఆ తర్వాత నవంబర్ 19న పాక్షిక చంద్రగహణం, డిసెంబర్ 4న సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనున్నాయి.