బీపీ ట్యాబ్లెట్ తో కరోనాకు చెక్ పెట్టొచ్చంటున్న సైంటిస్టులు

బీపీ ట్యాబ్లెట్ తో కరోనాకు చెక్ పెట్టొచ్చంటున్న సైంటిస్టులు

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సైంటిస్ట్ లు కరోనా వైరస్ ను హతమార్చే వైరస్ ను కనిపెట్టేందుకు నిర్విరామంగా పరిశోధనలు జరుపుతున్నారు. ఈ పరిశోధనల్లో బీపీ మెడిసిన్ కరోనా వైరస్ సోకకుండా ఉంచేందుకు, సోకిన తరువాత ప్రమాద స్ధాయిల్ని తగ్గించేందుకు ఉపయోగపడుతుందని యూఎస్ కు చెందిన జాన్ హాప్కిన్స్ కిమ్మోల్ క్యాన్సర్ సెంటర్ సైంటిస్ట్ లు చెబుతున్నారు.  రక్తపోటును తగ్గించే ప్రజోసిన్ వైరస్ నుంచి రక్షిస్తుందని తెలిపారు.  అయితే కరోనా ప్రారంభ దశలో ఉన్నవారు ప్రమాదం నుంచి బయటపడవచ్చని అంటున్నారు.

బీపీ ని తగ్గించే మెడిసిన్ కరోనా వైరస్ నుంచి కాపాడుతోందా

బీపీని తగ్గించే మెడిసిన్ రక్తనాళాలకు రిలాక్సేషన్ ఇస్తుంది. దీంతో రక్తపోటు అదుపులోకి వస్తుంది. అంతేకాదు దీన్ని వైరస్ నుంచి బాధితుల్ని కాపాడవచ్చని సైంటిస్ట్ లు చెబుతున్నారు.

కరోనా బాధితుల మరణాలకు కారణం  సైటోకిన్ స్మార్ట్ సిండ్రోమ్ అని, దానికి చెక్ పెట్టేందుకు రక్తపోటును తగ్గించే ట్యాబ్లెట్ ను వినియోగించ వచ్చని  జాన్ హాప్కిన్స్ కిమ్మోల్ క్యాన్సర్ సెంటర్ సైంటిస్ట్ లు చెప్పారు. ఈ మెడిసిన్ వినియోగంలోకి రావాలంటే తొలత క్లినికల్ ట్రయిల్స్ నిర్వహించాలని చెబుతున్నారు.