ట్విట్టర్ యూజర్లకు షాక్.. బ్లూటిక్ తొలగించనున్న మస్క్

ట్విట్టర్ యూజర్లకు షాక్.. బ్లూటిక్ తొలగించనున్న మస్క్

ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్ యూజర్లకు షాకింగ్ న్యూస్ ఇచ్చాడు. ఏప్రిల్ 1 నుంచి అన్ని ట్విట్టర్ అకౌంట్స్ కు బ్లూటిక్ ను తొలగిస్తున్నట్లు ప్రకటించాడు. ఏప్రిల్ 1 తర్వాత బ్లూటిక్  సబ్ స్క్రిప్షన్ కావాలనుకునేవాళ్లు వాళ్లకు కావాల్సిన ప్లాన్ అమౌంట్ చెల్లించి బ్లూటిక్ సర్వీస్ పొందొచ్చని మస్క్ సూచించాడు. బ్లూటిక్ కోసం నిర్ణయించిన అమౌంట్ మొత్త కడితేనే ట్విట్టర్ అకౌంట్ కు బ్లూటిక్ ఉంటుంది. మిగతా వాళ్లకు లోగో కనిపించదు.

ట్విట్టర్ బ్లూటిక్ సబ్ స్క్రిప్షన్ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంది. భారత్ లో ట్విట్టర్ బ్లూ వెబ్ కోసం నెలవారి ప్లాన్ రూ.650, మొబైల్ యూజర్లు రూ.900 చెల్లించాల్సి ఉంటుంది. బ్లూటిక్ వెరిఫికేషన్ తీసుకోవడం ద్వారా యూజర్లు 4వేల అక్షరాల వరకు ట్వీట్ రాయొచ్చు. అంతేకాకుండా యాడ్స్ కూడా తక్కువగా కనిపిస్తాయి.