ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లోనూ బ్లూటిక్ సబ్‌స్క్రిప్షన్

ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లోనూ బ్లూటిక్ సబ్‌స్క్రిప్షన్

మైక్రో బ్లాగింగ్ ఫ్లాట్ ఫాం ట్విట్టర్ బాటలోనే ఇప్పుడు ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ కూడా నడవనున్నాయి. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఇటీవలే ట్విట్టర్ లో బ్లూ టిక్ కోసం సబ్‌స్క్రిప్షన్​ప్లాన్ ను అనౌన్స్ చేయగా.. ఇప్పుడు మెటా కూడా అదే తరహా పద్ధతిని ఎంచుకుంది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లో వెరిఫైడ్​ బ్లూ టిక్ అకౌంట్ కోసం సబ్‌స్క్రిప్షన్​ను తీసుకొచ్చేందుకు మెటా సిద్ధమైంది. ఈ విషయాన్ని మెటా సీఈఓ మార్క్ జుకర్​​బర్గ్ వెల్లడించారు. దాంతో పాటు బ్లూ టిక్ కోసం నెలవారి సబ్​స్క్రిప్షన్ ధరను కూడా ప్రకటించారు. ఆండ్రాయిడ్ యూజర్లకు రూ.1,239, ఆపిల్ ఫోన్ యూజర్లకు నెలకు రూ.991గా మెటా నిర్ణయించింది. అయితే ఈ ప్లాన్ ను మొదటిసారిగా ఈ వారంలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో ప్రారంభిస్తున్నటు మెటా వెల్లడించింది. రానున్న రోజుల్లో మరిన్ని దేశాలకు విస్తరిస్తామని చెప్పింది. ఇంతకుముందు వెరిఫైడ్ బ్లూటిక్ కోసం మెటా ఎలాంటి అదనపు రుసుమును వసూలు చేయలేదు. ప్రముఖులకు, వ్యాపారుల అకౌంట్లకు ఉచితంగానే బ్లూటిర్ కు ఇచ్చేది. అయితే సేవల్లో కచ్చితత్వం, భద్రతను పెంచేందుకు ఈ కొత్త పద్ధతిని అమల్లోకి తీసుకొస్తున్నట్టు మెటా స్పష్టం చేసింది. అంతే కాకుండా గతంలో వెరిపైడ్ అయిన ప్రముఖులు బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్​తీసుకోవాల్సిన అవసరం లేదని కూడా క్లారిటీ ఇచ్చింది.