సుహాస్, శివానీ నాగారం జంటగా గోపీ అచ్చర దర్శకత్వంలో బి.నరేంద్ర రెడ్డి నిర్మించిన చిత్రం ‘హే బల్‌వంత్’. బన్నీవాస్, వంశీ నందిపాటి థియేట్రికల్ రిలీజ్ చేశారు. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల అభినందనలతో పాటు, విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ హిట్ టాక్‌తో దూసుకపోతోందని టీమ్ చెప్పింది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్‌లో సుహాస్ మాట్లాడుతూ ‘నాకెరీర్‌లో ఇది బిగ్గెస్ట్ ఓపెనింగ్. కలెక్షన్లు చూస్తే నమ్మలేకపోతున్నా.
ఆడియెన్స్ విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నామని చెప్పడం చాలా సంతోషాన్ని ఇస్తోంది’ అని చెప్పాడు. మంచి సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చినందుకు హ్యపీగా ఉందని శివానీ చెప్పింది. ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు దర్శక నిర్మాతలు థ్యాంక్స్ చెప్పారు.
వంశీ నందిపాటి మాట్లాడుతూ ‘చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. మార్నింగ్ షోతో పోల్చితే మ్యాట్నీకి కలెక్షన్లు పెరిగాయి. ఒత్తిడిలో ఉన్న వారికి మా సినిమా మెడిసిన్ లాంటిది’ అని చెప్పారు. నటులు వీకే నరేష్, సుదర్శన్, స్రవంతి ఈ సినిమాకొస్తున్న రెస్పాన్స్ పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
