
హైదరాబాద్, వెలుగు: బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ (బీఎన్ఐ) ఆధ్వర్యంలో ఈ నెల 13, 14 తేదీల్లో రెండు రోజుల పాటు శంషాబాద్ ఎస్ఎస్ కన్వెన్షన్‌లో ‘బీఎన్ఐ గోనాట్ 2025’ పేరుతో ఎంఎస్ఎంఈ ఎక్స్‌పో నిర్వహించనున్నట్లు బీఎన్ఐ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజనా షా ప్రకటించారు. బంజారా హిల్స్ లోని తాజ్ డెక్కన్ లో జరిగిన సమావేశంలో మంగళవారం ఆయన మాట్లాడారు.
రెండు రోజుల పాటు కొనసాగనున్న ఈ ఎక్స్పోను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించనున్నారని చెప్పారు. ఎంఎస్ఎంఈ భవిష్యత్తు, దేశ నిర్మాణంలో వాటి పాత్ర, తెలంగాణ ప్రభుత్వం ఈ రంగాన్ని బలపరచడానికి తీసుకుంటున్న ప్రయత్నాలపై చిట్చాట్ఉంటుందన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే ఇది అతి పెద్ద సెమినార్ అని వివరించారు.