
కిన్షాసా(కాంగో)/లాహోర్: కాంగోలోని ఈక్వెడార్ ప్రావిన్స్‌లోని సముద్రంలో మోటార్ బోటు బోల్తా పడి 86 మంది మృతి చెందారు. బసాన్‌కుసు ప్రాంతంలో బుధవారం (సెప్టెంబర్ 10) ఈ ప్రమాదం జరిగిందని ఆ దేశ మీడియా సంస్థలు వెల్లడించాయి. బాధితుల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నారని తెలిపాయి. బోటులో పరిమితికి మించి ఎక్కడం, రాత్రి సమయంలో సముద్రంలో ప్రయాణించడంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు.
మరోవైపు, పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో మూడు బోట్లు బోల్తా పడడంతో 10 మంది వరద బాధితులు చనిపోయారు. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సౌత్ పంజాబ్‌లోని పలు గ్రామాలు వరదల్లో మునిగిపోయాయి.