నాగార్జునసాగర్ లో లాంచీ ప్రయాణాలు షురూ

V6 Velugu Posted on Jun 22, 2021

నాగార్జునసాగర్: లాక్ డౌన్ ఎత్తివేయడంతో చాలా రోజుల తర్వాత సాగర్ జలాశయంలో లాంచిల ప్రయాణాలు మొదలయ్యాయి. గత కొద్ది రోజులుగా కరోనా నిబంధనలు పాటిస్తూ జాలీ ట్రిప్పులు నడుపుతున్న నేపధ్యంలో తాజాగా నాగార్జునకొండకు ఆంధ్రా అటవీ అధికారులు కూడా అనుమతిచ్చింది. దీంతో చాలా కాలం తర్వాత నాగార్జునకొండకు లాంచీల ప్రయాణాలు మళ్లీ యధావిధిగా జరగనున్నాయి. తెలంగాణ ఏర్పాటు జరిగినప్పటి నుంచి నాగార్జునకొండకు ఆంద్ర ప్రభుత్వం అనుమతివ్వలేదు. అయితే ఇటీవల అటవీశాఖ అధికారులు తెలంగాణ లాంచీలు నాగార్జునకొండకు వెళ్లేందుకు అనుమతిచ్చినట్లు టూరిజం శాఖ మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్ రావు వెల్లడించారు. నాగార్జునకొండపై పురావస్తుశాఖ మ్యూజియం తెరచుకుంటే లాంచీలు నాగార్జున కొండకు వెళ్లడానికి టికెట్ల ధరలు ఖరారు చేశారు. పెద్దలకు రూ.150, పిల్లలకు రూ.120 వసూలు చేస్తారు. 

Tagged TS tourism, AP Telangana, , nalgonda today, Boat trips starts, Nagarjunasagar Reservoir, boating in nagarjuna sagar, krishna river tourism

Latest Videos

Subscribe Now

More News