
ఢిల్లీ మెట్రోలో బాలీవుడ్ నటి ..సాధారణ ప్రయాణికుడితో గొడవకు దిగింది. నోటికొచ్చినట్లు బూతులు తిట్టింది. కొట్టింది. దుర్భాషలాడింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
బాలీవుడ్ నటి బాబీ డార్లింగ్ ఢిల్లీ మెట్రోలో ప్రయాణిస్తోంది. బాబీ డార్లింగ్ తెల్లటి బ్యాగ్‌ను పట్టుకుని ఉండగా.. ఓ వ్యక్తి దానిని లాగడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ సమయంలో అతన్ని బాబీ డార్లింగ్ బూతులు తిట్టింది. బాబీ డార్లింగ్ బూతులు తిట్టడంతో ఆ వ్యక్తి కూడా తిరగబడ్డాడు. తెల్లటి కవర్ ను పట్టుకుని లాగాడు. దీంతో వీరిద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బాబీ డార్లింగ్, ఆ వ్యక్తి కొట్టుకుంటుండగా...సీఐఎస్‌ఎఫ్ జవాన్ జోక్యం చేసుకుని వారిద్దరినీ శాంతింపజేశారు.
Kalesh b/w Bobby Darling and a Guy inside Delhi metro over little issue pic.twitter.com/M1H0LmyKu5
— Ghar Ke Kalesh (@gharkekalesh) October 5, 2023
ఈ ఘటనపై ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. మెట్రో రైళ్లలో ఇటువంటి చర్యలను సహించబోమని.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇలాంటి ఘటనను తమ దృష్టికి తీసుకురావాలని ఢిల్లీ మెట్రోరైల్ కోరింది.
- ALSO READ | మహాదేవ్ APPలో అంత లాభాలా : పెళ్లికి రూ.200 కోట్లు ఖర్చు పెట్టాడా.. ఏం పెట్టాడు.. ఎలా చేశాడు..?
బాబీ డార్లింగ్ ఒక ట్రాన్స్ జెండర్ నటి. పంకజ్ శర్మగా పిలువబడే అతను..ఆ తర్వాత బాబీ డార్లింగ్‌గా మారాడు. 1999లో అనిల్ కపూర్ నటించిన తాల్‌లో బాబీ డార్లింగ్ డ్రెస్ డిజైనర్‌గా నటించింది. తాల్, చల్తే చల్తే, పేజ్ 3 సహా పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించిన ఆమె.. హిందీ బిగ్ బాస్ మొదటి ఎడిషన్‌లో పాల్గొంది. బాబీ డార్లింగ్ 2016లో భోపాల్‌కు చెందిన వ్యాపారవేత్త రామ్నిక్ శర్మను వివాహం చేసుకుంది. కొన్నాళ్లకు విడిపోయింది. బాబీ డార్లింగ్ అనేక టీవీ షోలలో కనిపించింది.