మహాదేవ్ APPలో అంత లాభాలా : పెళ్లికి రూ.200 కోట్లు ఖర్చు పెట్టాడా.. ఏం పెట్టాడు.. ఎలా చేశాడు..?

మహాదేవ్ APPలో అంత లాభాలా : పెళ్లికి రూ.200 కోట్లు ఖర్చు పెట్టాడా.. ఏం పెట్టాడు.. ఎలా చేశాడు..?

మహదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఉన్న పలువురు బాలీవుడ్ నటీనటులకు ఈడీ నోటీసులు చేసింది. శుక్రవారం (అక్టోబర్ 6) విచారణకు హాజరు కావాలని  ప్రముఖ బాలీవుడ్ నటీనటులు రణ్ బీర్ కపూర్, కపిల్ శర్మ, హీనాఖాన్ లను విచారణ కు హాజరు కావాలని నోటీసులు పంపింది. రాయ్పూర్ ఆఫీసులో విచారణకు హాజరు కావాలని కోరింది. 

మహదేవ్ ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ అసలు కథ.. 

సౌరభ్ చంద్రకర్, రవి ఉప్పల్ ప్రమోట్ చేసిన కంపెనీ ఇది. దుబాయ్ నుంచి నిర్వహిస్తున్నారు. క్రికెట్, టెన్నిస్, బ్యాడ్మింటన్, పోకర్, కార్డ్ గేమ్‌లతో సహా వివిధ లైవ్ గేమ్‌లలో అక్రమ బెట్టింగ్‌ల కోసం మహాదేవ్ యాప్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లను అందించింది. కొత్త వినియోగదారులను చేర్చుకోవడానికి, ఐడిలను సృష్టించడానికి , బినామీ బ్యాంకు ఖాతాల లేయర్డ్ వెబ్ ద్వారా డబ్బును లాండర్ చేయడానికి ఆన్‌లైన్ బుక్ బెట్టింగ్ అప్లికేషన్‌ను ఉపయోగిస్తోందని ED ఆరోపించింది.

బెట్టింగ్‌ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆఫ్‌షోర్ ఖాతాలకు తరలించేందుకు పెద్ద ఎత్తున హవాలా కార్యకలాపాలు జరిగాయని ఈడీ పేర్కొంది. ఈ కుంభకోణం ద్వారా కంపెనీ దాదాపు రూ.5వేల కోట్లు సంపాదించిందని ఆరోపించారు.

మహాదేవ్ బెట్టింగ్ యాప్ ను బాలీవుడ్ నటులు ఆన్ లైన్ లో ప్రచారం చేసి ప్రమోటర్ల నుంచి భారీ మొత్తంలో డబ్బు అందుకున్నారని ఈడీ ఆరోపిస్తోంది.  ఈ కేసులో 15 మంది ప్రముఖ సెలబ్రిటీలు, నటుల పాత్ర ఉన్నట్లు ఈడీ అనుమానిస్తోంది. మిగతా వారికి కూడా త్వరలోనే నోటీసులు జారీ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసులో వీరు నిందితులు కారని, హవాలా వ్యవహారంలో చెల్లింపులు ఎలా జరిగాయన్నది తెలుసుకోవడానికే వీరిని విచారించనున్నట్లు తెలుస్తోంది. 

మహాదేవ్‌ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌ ప్రమోటర్లు సౌరభ్‌ చంద్రకర్‌, రవి ఉప్పల్‌ భారత్‌లో నాలుగు వేల మంది ఆపరేటర్లను నియమించుకున్నారు. 70-30 నిష్పత్తి ప్రకారం లాభాల్లో వాటా ఇస్తామని వివిధ దేశాల్లో బీటర్లను నియమించుకున్నారు. ఈ యాప్‌ కార్యకలాపాలు యూఏఈ ప్రధాన కేంద్రంగా సాగుతున్నట్లు ఈడీ విచారణలో తేలింది. సౌరభ్‌, రవి ప్రస్తుతం పరారీలో ఉన్నారు.

రూ.200 కోట్లతో సౌరభ్ చంద్రాకర్ పెళ్లి.. ఇదే విచారణకు కారణం  

దుబాయ్‌లో విలాసవంతమైన జీవితాన్ని గడిపిన సౌరభ్ చంద్రకర్ ఫిబ్రవరిలో రస్ అల్-ఖైమాలో పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లికి దాదాపు 2 00 కోట్లు ఖర్చు చేశాడు. సౌరభ్ చంద్రాకర్ మ్యారేజ్ ఈవెంట్ కి బాలీవుడ్ తారలు, ప్రముఖులు హాజరయ్యారు. విశాల్ దద్లానీ, టైగర్ ష్రాఫ్, సోనాక్షి సిన్హా, అతిఫ్ అస్లాం, సన్నీ లియోన్, నేహా కక్కర్, అలీ అస్గర్, భారతీ సింగ్, భాగ్యశ్రీ, పుల్కిత్ సామ్రాట్, ఎల్లి అవ్రామ్, రహత్ ఫతే అలీ ఖాన్ వంటి ప్రముఖులు వివాహ వేడుకలు వచ్చారు. ముంబై కి చెందిన ఈవెంట్ సంస్థ సౌరభ్ పెళ్లి ఈవెంట్ ను నిర్వహిచింది. ఇదే మహాదేవ్ ఆన్ లైన్ బెట్టింగ్ యాప్  విచారణకు కారణమైంది.