బాబీ డియోల్ బందర్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్... 

బాబీ డియోల్ బందర్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్... 

డిఫరెంట్ స్ర్కిప్ట్‌‌లను సెలెక్ట్ చేసుకుంటూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు బాబీ డియోల్.  తనదైన నటనతో బాలీవుడ్‌‌తోపాటు టాలీవుడ్‌‌లోనూ పేరు తెచ్చుకున్నాడు బాబీ.  తాజాగా తన కొత్త మూవీకి సంబంధించిన అప్‌‌డేట్ వచ్చింది. తను లీడ్ రోల్‌‌లో నటిస్తున్న ‘బందర్’ చిత్రం రిలీజ్ డేట్‌‌ను అనౌన్స్ చేశారు. 

వేసవి కానుకగా మే 22న వరల్డ్‌‌వైడ్‌‌గా ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రకటిస్తూ బాబీ డియోల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌ను రిలీజ్ చేశారు. ఇందులో ఆయన డిఫరెంట్ లుక్‌‌లో కనిపిస్తున్నాడు. తన క్యారెక్టర్‌‌‌‌ ఎలా ఉండబోతోందనే క్యూరియాసిటీని ఈ పోస్టర్ క్రియేట్ చేసింది. 

అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నిఖిల్ ద్వివేది, సాన్య మల్హోత్రా కలిసి నిర్మిస్తున్నారు. జీ స్టూడియోస్ సంస్థ ఈ చిత్రాన్ని వరల్డ్‌‌వైడ్‌‌గా విడుదల చేస్తోంది.