బోథ్​ మార్కెట్ ​చైర్మన్​గా బొడ్డు గంగారెడ్డి

బోథ్​ మార్కెట్ ​చైర్మన్​గా బొడ్డు గంగారెడ్డి

బోథ్​, వెలుగు: బోథ్​ వ్యవసాయ మార్కెట్​కమిటీ చైర్మన్​గా మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్​సీనియర్​ నాయకుడు బొడ్డు గంగారెడ్డిని, వైస్ ​చైర్మన్​గా నేరడిగొండ మండలానికి చెందిన ఆడే వసంత్​రావును నియమిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

వీరితో పాటు 16 మంది కమిటీ సభ్యులను నియమించింది. మార్కెట్​కమిటీలను రద్దు చేసిన తర్వాత మొట్టమొదటగా బోథ్​ మార్కెట్​ కమిటీని నియమించినందుకు వారు సీఎం రేవంత్​రెడ్డికి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావుకు, జిల్లా ఇన్​చార్జి మంత్రి సీతక్కకు ధన్యవాదాలు తెలిపారు. రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.