
MPP కి కావాల్సినంత బలం ఉన్నా…స్థానిక ఎమ్మెల్యే అడ్డు రావడంతో కన్నీరుమున్నీరైంది ఓ మహిళ. తాను చదువుకున్నానని … MPP అయ్యే అవకాశాన్ని దూరం చేయవద్దని చివరకు ఆ ఎమ్మెల్యే కాళ్లు కూడా పట్టుకుంది. అయినా కనికరించ లేదు కదా…సర్ధి చెప్పేందుకు ప్రయత్నించారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది.
బోధన్ మండలం పెటకలాన్ కు చెందిన సంజీవ్ సువర్ణ TRS తరపున MPTC గా గెలుపొందారు. అంతేకాదు ఆమెకు MPP కి కావాల్సినంత MPTC ల మద్దతు ఉంది. అయితే ఆమెను MPP కాకుండా అడ్డుపడ్డారు స్థానిక ఎమ్మెల్యే షకీల్ అమీర్. తనకు అనుకూలంగా ఉన్న వారినే MPP చేయాలని నిర్ణయించారు. దీంతో సంజీవ్ సువర్ణ ఆవేదన వ్యక్తం చేశారు. MPP అయ్యే అవకాశాన్ని దూరం చేయవద్దని… ఎమ్మెల్యే షకీల్ కాళ్లపై పడి బతిమిలాడినా కనికరించలేదు.