
ఎప్పుడైతే AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఎంటరైందో.. అప్పట్నుంచి సాఫ్ట్ వేర్ రంగంలో పనిచేస్తున్న టెకీలకు జాబ్ సెక్యూరిటీ లేకుండా పోయింది. మనిషి చేసే పనిని అంతకు మించిన వేగంతో పర్ఫెక్ట్ గా ఏఐ చేస్తుండటంతో కంపెనీలన్నీ ఆ బాటలో నడుస్తున్నాయి. అందులో భాగంగా స్టాఫ్ ను తొలగిస్తూ ఆర్థిక భారాన్ని తగ్గించుకుంటూ వస్తు్న్నాయి. లేటెస్ట్ గా టీసీఎస్ కంపెనీ 12 మంది ఎంప్లాయిస్ ను తొలగించనున్నట్లు ప్రకటించి బాంబు పేల్చింది.
ఇండియాలోనే అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) లేయాఫ్స్ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. కంపెనీలో పనిచేసే ఉద్యోగుల్లో 2 శాతం తొలగించనున్నట్లు ప్రకటించింది. 2026 ఫైనాన్షియర్ ఇయర్ లో.. అంటే 2026 ఏప్రిల్ లోపు కంపెనీలో 12 వేల ఉద్యోగులను ఇంటికి పంపనున్నట్లు ప్రకటించింది.
ALSO READ | తెలంగాణలో ఆధార్ సూపర్వైజర్ ఉద్యోగాలు.. లోకల్లో ఉంటూ జాబ్ చేసుకోవచ్చు.. మంచి ఛాన్స్ !
క్లైంట్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా.. సర్వీస్ డెలివరీలో ఎలాంటి తేడా రాకుండా వర్క్ ఫోర్స్ ను తగ్గించుకోనున్నట్లు ప్రకటించింది. ఏఐతో వచ్చిన మార్పుల కారణంగా ఆ టెక్నాలజీ పైన వర్క్ చేసే కొత్తతరాన్ని డెవలప్ చేసుకోనున్నట్లు పేర్కొంది.
నాన్ ఎసెన్షియల్ టెక్నాలజీపైన క్లైంట్స్ ఖర్చులు తగ్గించుకుంటుండటంతో.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. పాతతరం టెక్నాలజీపై తక్కువ డిమాండ్ ఉండటం, ప్రపంవ వ్యాప్తంగా ఉన్న ద్రవ్యోల్బణం, యూఎస్ ట్రేడ్ పాలసీ అనిశ్చితి కారణంగా ఐటీ సెక్టార్ లో పెట్టుబడులు తగ్గుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నెల ప్రాజెక్టుల ఒప్పందం, నిర్ణయాలు కాస్త ఆలస్యం కానున్నట్లు టీసీఎస్ సీఈఓ కె.కృతివాసన్ తెలిపారు.
జులై నెలలోనే మైక్రోసాఫ్ట్ సంస్థ తన వర్క్ ఫోర్స్లో 4 శాతం ఉద్యోగాలకు కోత పెట్టనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అంటే సుమారు 9100 మంది ఉద్యోగులను మైక్రోసాఫ్ట్ తమ ఉద్యోగాల నుంచి తొలగించనుందని Seattle Times తెలిపింది. జూన్ 2024 నాటికి మైక్రోసాఫ్ట్లో ప్రపంచవ్యాప్తంగా 2 లక్షల 28 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 2025 మే నెలలో మైక్రోసాఫ్ట్ లేఆఫ్స్ ప్రకటించింది. ఈ ప్రభావంతో 6 వేల మంది ఉద్యోగాలు కోల్పోయారు.
గూగుల్ కూడా ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో మూడు సార్లు లేయాఫ్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. గూగుల్ సంస్థ తన గ్లోబల్ బిజినెస్ యూనిట్ నుంచి 200 మంది వరకు ఉద్యోగులను ఇళ్లకు పంపినట్లు వెల్లడైంది. ఈ ఉద్యోగులు సేల్స్ అండ్ పార్ట్నర్ షిప్ విభాగానికి చెందిన వ్యక్తులుగా తేలింది. 2025 ప్రారంభం నుంచి కేవలం 5 నెలల కాలంలో కంపెనీ ఉద్యోగుల కోతలను ప్రకటించటం మూడోసారి కావటంతో చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.