కాంగోలో మారణహోమం.. చర్చిపై ఉగ్రవాదుల దాడి.. 21 మంది మృతి

కాంగోలో మారణహోమం.. చర్చిపై ఉగ్రవాదుల దాడి..  21 మంది మృతి

దేశమేదైతేనేం.. దేవుడి పేరున మారణహోమాలు జరుగుతూనే ఉన్నాయి. మత ద్వేషం.. మత మౌఢ్యంతో సాటి మనుషులను చంపుతూనే ఉన్నారు. ఎవరి మతం వారిదే.. ఎవరి సంస్కృతి వారిదే.. అనుకునే ఇంగిత జ్ఞానం లేక అమాయకులను పొట్టన పెట్టుకుంటూనే ఉన్నారు. ఆదివారం కాంగోలో జరిగిన ఉగ్రదాడిలో 21 మంది చనిపోవడం ప్రపంచాన్ని దిగ్ర్భాంతికి గురిచేస్తోంది.

కాంగోలో ఉగ్రవాదులు దారుణ మారణ హోమానికి పాల్పడ్డారు. తూర్పు కాంగోలో ఓ చర్చిపై ఇస్లామిట్ స్టేట్ సంస్థ మద్ధతు దారులు దాడి చేయడంతో 21 మంది మృతి చెందారు. అల్లైడ్ డెమొక్రటిక్ ఫోర్స్ (ADF)  కు చెందిన ఉగ్రవాదులు అర్ధరాత్రి కోమండా చర్చిలో దాడికి దిగారు. ఈ దాడిలో చర్చితో పాటు చుట్టుపక్కల ఉన్న ఇండ్లు, షాపులు ధ్వంసం అయ్యాయి. 

ALSO READ | ఇరాన్‎లో ఉగ్రదాడి.. కోర్టు భవనంపై ఎటాక్ చేసిన టెర్రరిస్టులు.. 8 మంది మృతి

ఉగ్రదాడిలో చర్చి లోపల, బైట ఉన్న వ్యక్తులు మొత్తం 21 మంది చనిపోయారు. దుండగుల కోసం వేట కొనసాగుతోందని సివిల్ సొసైటీ కోఆర్డినేటర్ డ్యూడన్నే దూరంతబో తెలిపారు. ఈ దాడిపై కాంగో ఆర్మీ స్పందించింది. చర్చిలోకి ఆయుధాలతో కూడిన వ్యక్తి ప్రవేశించాడు. ఆయుధాలతో మారణహోమం సృష్టించాడని ఆర్మీ పేర్కొంది.

ఇస్లామిక్ స్టేట్ తో సంబంధాలున్న రెబల్ గ్రూప్ ADF.. ఉగాండా, కాంగో రిపబ్లిక్ బార్డర్ లో ఉగ్రకార్యకలాపాలకు పాల్పడుతుంటుంది. గత పదేళ్లుగా కాంగోలో ఉగ్రకార్యకలాపాలకు పాల్పడుతూ వస్తున్నారు.