బోధన్, వెలుగు: బోధన్ పట్టణంలోని జూనియర్ కాలేజీ గ్రౌండ్ వద్ద అమ్మాయిలను వేధిస్తున్న ఓ ఆకతాయిని షీ టీం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. గురువారం స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ శేష తల్ప సాయి ఎదుట హాజరుపరచగా, న్యాయమూర్తి రెండు రోజుల జైలు శిక్ష విధించినట్లు పట్టణ సీఐ వెంకట నారాయణ తెలిపారు. బోధన్ పట్టణంలో షీ టీం, స్థానిక పోలీసులు కలిసి ఆడపిల్లలను వేధించే ఆకతాయిలను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
