బోధన్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు తాళం

బోధన్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు తాళం

బోధన్​,వెలుగు: అద్దె చెల్లించకపోవడంతో బోధన్​సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు గురువారం ఇంటి ఓనర్ తాళం వేశారు. మూడేండ్లుగా అద్దె సుమారు రూ.26 లక్షలు చెల్లించాల్సి ఉంది. విసిగిపోయిన ఇంటి ఓనర్​చివరకు ఆఫీసుకు తాళం వేశారు.

 దీంతో సబ్ రిజిస్ట్రార్ సాయికుమార్, సిబ్బంది విధులకు వచ్చి బయట మెట్లపైనే కూర్చున్నారు. దీంతో ఆఫీసులో సేవలు నిలిచిపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. సబ్​రిజిస్ట్రార్  సాయికుమార్​జిల్లా అధికారులకు సమాచారం అందించడంతో ఓనర్​తో మాట్లాడారు. త్వరలో అద్దె చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో ఆఫీసు మధ్యాహ్నం తెరుచుకుంది.