బోడుప్పల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్​ అవిశ్వాస తీర్మానానికి హైకోర్టు సమర్థన

బోడుప్పల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్​ అవిశ్వాస తీర్మానానికి హైకోర్టు సమర్థన

హైదరాబాద్, వెలుగు: మేడ్చల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మల్కాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గిరిలోని బోడుప్పల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేయర్, డిప్యూటీ మేయర్లపై అవిశ్వాస తీర్మాన నోటీసులపై గతంలో సింగిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జడ్జి ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. అవిశ్వాస తీర్మాన నోటీసు సబబేనని, ఈ ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని పేర్కొంది. కాగా, అవిశ్వాస తీర్మానం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జారీ చేసిన నోటీసులను సమర్థిస్తూ సింగిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జడ్జి ఇచ్చిన తీర్పును మేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొత్త లక్ష్మీ రవిగౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైకోర్టులో వేర్వేరుగా సవాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. వీటిని చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అలోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అరాధే, జస్టిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జె.అనిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల డివిజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బుధవారం డిస్మిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తూ తీర్పు చెప్పింది. జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 21న కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చిన నోటీసులు సమర్థనీయమేనని వెల్లడించింది.