లక్ష గాజుల అలంకరణలో నిమిషాంబిక దేవి

లక్ష గాజుల అలంకరణలో నిమిషాంబిక దేవి

శ్రావణమాసంలో భాగంగా బోడుప్పల్ నిమిషాంబిక ఆలయంలో ఆదివారం లక్ష గాజులతో సుమంగళి, కుంకుమార్చన పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు శ్రీనివాస్ మాట్లాడుతూ.. గాజులతో పూజ చేయడం ద్వారా అమ్మవారు శాంతి, సౌభాగ్యం, ఐశ్వర్యాలను కలిగిస్తుందన్నారు. మరో మూడు రోజులు అమ్మవారు గాజుల అలంకరణలో ఉంటుందని, భక్తులు కుటుంబ సమేతంగా దర్శించాలని కోరారు.