కుంటాలలో ఘనంగా జన్మాష్టమి.. జాతరకు పోటెత్తిన భక్తులు

కుంటాలలో ఘనంగా జన్మాష్టమి.. జాతరకు పోటెత్తిన భక్తులు

కుంటాల, వెలుగు: కుంటాల మండల కేంద్రంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఆదివారం ఘనంగా ముగిసాయి. పల్లకి ఊరేగింపు లో భక్తులు వేలాది గా తర లి వచ్చారు. పాత బస్టాండ్ లో ఉట్టి కొట్టేందు కు యువకులు పోటీ పడ్డారు. రాజపూర్‌‌కు చెందిన సేవాలాల్ యూత్ సభ్యులు ఉట్టి కొట్టి రూ.10 ,111 న గదు గెలుచుకున్నారు. 

విజేత జట్టుకు మాజీ జడ్పీ చైర్మన్ జుట్టు అశోక్, రూరల్  సీఐ నగదు అందజేసి సన్మానించారు. సప్తమి  జాతరకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు.రిటైర్డ్ ఉపాధ్యాయుడు వాటో లి కిష్టయ్య భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఎస్ ఐ అశోక్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.