మహిళా ఉద్యోగిపై లైంగిక వేధింపులు ... కలెక్టరేట్ సీనియర్ అసిస్టెంట్ పై అట్రాసిటీ కేసు

మహిళా ఉద్యోగిపై లైంగిక వేధింపులు ... కలెక్టరేట్  సీనియర్ అసిస్టెంట్ పై అట్రాసిటీ కేసు

హనుమకొండసిటీ, వెలుగు: హనుమకొండ కలెక్టరేట్ లో ఇటీవల దళిత మహిళా ఉద్యోగిపై లైంగిక వేధింపులకు పాల్పడి సస్పెండ్  అయిన సీనియర్  అసిస్టెంట్  ఇర్ఫాన్ సోహైల్పై లైంగిక వేధింపులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది.  హనుమకొండ కలెక్టరేట్  పని చేస్తున్న ఇర్ఫాన్  సోహైల్  గత నెల 13న ఓ మహిళా ఉద్యోగిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. 

ఆమె ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా, కలెక్టర్ స్నేహ శబరీశ్  విచారణ అనంతరం సస్పెండ్  చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తరువాత ఇర్ఫాన్  సోహైల్  బాధితురాలిపై తప్పుడు ప్రచారం చేస్తుండడంతో ఈ నెల 11న సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేసింది.