కొందరికి గుడ్లు పూర్తిగా ఉడికితే నచ్చదు. మరికొందరు బాగా ఉడికితేనే తింటారు. మరి గుడ్డు ఎంతవరకు ఉడికిందో తెలుసుకోవడం ఎలా ? సింపుల్ ఈ ఎగ్ టైమర్ వాడితే సరిపోతుంది. ఇలాంటి టైమర్లను అనేక కంపెనీలు మార్కెట్‌లో అమ్ముతున్నాయి. దీనికి వేడికి స్పందించే గుణం ఉంటుంది. గుడ్లతో పాటు దీన్ని కూడా నీళ్లలో వేయాలి. నీళ్లు మరిగే కొద్దీ, ఈ టైమర్‌పై ఉన్న ఎరుపు రంగు తగ్గిపోతూ.. బయటి నుంచి లోపలి వైపునకు మారుతుంది. దానిపై సాఫ్ట్ (అరకొరగా ఉడికిన), మీడియం (మధ్యస్థంగా ఉడికిన), హార్డ్ (పూర్తిగా ఉడికిన) అనే గుర్తులు ఉంటాయి.
రంగు వాటిలో దేని దగ్గర ఉంటే గుడ్డు ఆ స్థితిలో ఉందని అర్థం. దీనివల్ల గుడ్లను ఉడికించేటప్పుడు పదే పదే టైం చూసుకోవాల్సిన అవసరం ఉండదు. పైగా గుడ్లను నచ్చిన విధంగా పర్ఫెక్ట్‌గా ఉడికించుకోవచ్చు. దీన్ని సురక్షితమైన ఫుడ్–గ్రేడ్ రెసిన్ మెటీరియల్‌తో తయారుచేశారు. వాడిన ప్రతిసారి శుభ్రం చేసుకుని, ఎన్నిసార్లైనా వాడుకోవచ్చు.
ధర: 142 రూపాయలు
