కాకతీయుల పాలన రాచరికం కాదు : బోయినపల్లి వినోద్ కుమార్

 కాకతీయుల పాలన రాచరికం కాదు :  బోయినపల్లి వినోద్ కుమార్

తెలంగాణ ఉద్యమ చరిత్ర గురించి మాట్లాడే నైతిక హక్కు సీఎం రేవంత్ రెడ్డికి లేదన్నారు కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి  బోయినపల్లి వినోద్ కుమార్.  కాంగ్రెస్ పార్టీ చేసే తప్పుడు విధానాలే చరిత్రను మరిపించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.  మార్పు కోరి ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేస్తే.. ఇదేనా మీరు చూపించే మార్పు అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. కాకతీయుల చరిత్ర మీకు తెలుసా అంటూ సీఎం రేవంత్ ను వినోద్ కుమార్  ప్రశ్నించారు.  

కాకతీయులు అణగారిన వర్గాల నుండి వచ్చి రాజ్యాధికారాన్ని పాలించారని చెప్పారు. ఈ చిహ్నన్ని రాజముద్రలో నుండి తొలగిస్తే సహించేది లేదన్నారు.  కాకతీయుల పాలన రాచరికపు పాలన కాదన్న వినోద్ కుమార్..  వారి పాలనను స్ఫూర్తిగా తీసుకుని కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశ పెట్టారని చెప్పారు.  ఛార్మినార్ ప్రజల సంక్షేమాన్ని చిహ్నమని చెప్పారు.  దీనిపై తాను హై కోర్టులో కేసు వేస్తానని..  చట్ట ప్రకారం పోరాడి తెలంగాణ రాజ ముద్రను సంరక్షిస్తానని తెలిపారు.