డీసీఎంఎస్​ చైర్మన్​గా బోళ్ల వెంకట్​రెడ్డి ఎన్నిక

డీసీఎంఎస్​ చైర్మన్​గా బోళ్ల వెంకట్​రెడ్డి ఎన్నిక
  • ప్రమాణస్వీకారానికి హాజరైన మంత్రి కోమటిరెడ్డి 

నల్గొండ అర్బన్, వెలుగు : డీసీఎంఎస్​ చైర్మన్​గా బోళ వెంకట్​రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం జరిగిన ఎన్నికల్లో ఆయన ఒక్కరే నామినేషన్​దాఖలు చేశారు. దీంతో వెంకట్​రెడ్డి ఎన్నికైనట్టు డీసీవో కిరణ్​కుమార్​ ప్రకటించారు. కొంతకాలంగా వైస్ చైర్మన్ గా ఉన్న దుర్గంపూడి నారాయణరెడ్డి ఇన్​చార్జి చైర్మన్​గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డీసీఎంఎస్ లో ఉన్న డైరెక్టర్లందరూ ప్రస్తుతం కేతపల్లి పీఏసీఎస్​చైర్మన్ గా వ్యవహరిస్తున్న బోళ్ల వెంకట్ రెడ్డిని చైర్మన్​గా ఎన్నుకున్నారు. పట్టణంలోని డీసీఎంఎస్ కార్యాలయంలో చైర్మన్​గా వెంకట్​రెడ్డి ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా  పలువురు డైరెక్టర్లు నూతనంగా ఎంపికైన చైర్మన్ వెంకట్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చైర్మన్​ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్​బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ గా దుర్గంపూడి నారాయణరెడ్డి, డైరెక్టర్లు గుడిపాటి సైదులు, ధనాపత్ జయరామ్, దొంగర వెంకటేశ్వర్లు, నెల్లూరు ఉషారాణి, ఎస్.అనురాధ, కొండ సరిత, కర్నాటి లింగయ్య పాల్గొన్నారు.