నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా : ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా : ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

దమ్మపేట, వెలుగు : అశ్వారావుపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. శుక్రవారం దమ్మపేట మండలం పూసుకుంట గ్రామంలో స్వయం సహాయక సంఘాల కోసం కమ్యూనిటీ భవన నిర్మాణం, పాఠశాల కాంపౌండ్ వాల్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం సుధాపల్లి, పాతలచ్చాపురం గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించారు. గురువాయిగూడెంలో ఎంపీపీ ఎస్ పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఇంటికి ఏదో ఓ రూపంలో సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్​పర్సన్ వాసం రాణి, కాంగ్రెస్ నాయకులు చిన్నంశెట్టి యుగంధర్, బుల్లి కొండ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.