వ్యవసాయ కూలీలు వెళ్తున్న బొలెరో బోల్తా..ఇద్దరికి గాయాలు

వ్యవసాయ కూలీలు వెళ్తున్న బొలెరో బోల్తా..ఇద్దరికి గాయాలు

సుల్తానాబాద్, వెలుగు: బొలెరో బోల్తా పడి ఇద్దరు వ్యవసాయ కూలీలకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా గడిసుర్లాకు చెందిన 20 మంది వ్యవసాయ కూలీలు కరీంనగర్ జిల్లా గుండ్లపల్లిలో వరి నాట్లు వేసేందుకు బొలెరోలో వెళ్తున్నారు. 

శనివారం తెల్లవారుజామున పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్నకల్వల వద్ద రాజీవ్ రహదారిపై వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. అనంతరం నాటు వేసేందుకు వెళ్లిపోయారు.