ఇది ప్రేమ కాదు.. పిచ్చి ప్రేమ.. తన నెంబర్ ఉంది కానీ ధైర్యం లేదు

ఇది ప్రేమ కాదు.. పిచ్చి ప్రేమ.. తన నెంబర్ ఉంది కానీ ధైర్యం లేదు

హీరోయిన్‌ సాయిపల్లవిపై మనసుపారేసుకున్నాడు బాలీవుడ్ నటుడు. సాయి పల్లవి అంటే తనకిష్టమని, ఈ విషయాన్ని సాయి పల్లవికి చెప్పే ధైర్యం తనకు లేదని, చాలా అందంగా తన మనసులోని మాటని బయటపెట్టేసాడు. ఇంతకీ ఆ బాలీవుడ్ యాక్టర్ మరెవరో కాదు గుల్షన్ దేవయ్య. హంటర్, బ్లర్, కమాండో3, బాధాయి దో, హేట్ స్టొరీ వంటి సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగరయ్యాడు. 

రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ యాక్టర్ సాయి పల్లవిపై క్రేజీ కామెంట్స్ చేసాడు. హీరోయిన్‌ సాయిపల్లవి అంటే తనకు చాలా ఇష్టమని, ఆమె తన క్రష్‌ అని చెప్పుకొచ్చాడు. సాయిపల్లవి అందం, డ్యాన్స్‌కు తాను ఫిదా అయిపోయానని, ఆమె పర్సనల్ నెంబర్‌ తన దగ్గర ఉన్నా.. ఫోన్‌ చేసి మాట్లాడే ధైర్యం చేయలేకపోతున్నానంటూ సాయి పల్లవిపై తనకున్న  ప్రేమ గురించి చెప్పుకొచ్చాడు.

 'సాయిపల్లవి అద్భుతమైన నటి, డ్యాన్సర్‌ కూడా. కొన్నిసార్లు ఆమెపై ఇన్‌ఫాచ్యువేషన్‌కు లోనయ్యాను. ఎందుకో తెలియదు కానీ..  ఆమె సినిమాలన్నీ తప్పకుండా చూస్తాను. ఆమెపై నాకు ఎంత పిచ్చి అంటే జీవితంలో ఒక్కసారైనా కలిసి పనిచేసే అవకాశం వస్తుందని ఎదురుచూస్తున్నా. అప్పుడు నా సంతోషానికి అవధులు ఉండవు' అంటూ సాయి పల్లవి పై తనకున్న పిచ్చిని బయటపెట్టాడు గుల్షన్‌. ప్రస్తుతం గుల్షన్ చేసిన ఈ కామెంట్స్‌ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారాయి. మరి ఈ కామెంట్స్ పై సాయి పల్లవి ఎలా స్పదిస్తుందో చూడాలి మరి.