
తనకు కరోనా వచ్చి తగ్గిపోయిందని ప్రముఖ నటి జెనీలియా డిసౌజా తెలిపారు. బాయ్స్ సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తనకు మూడు వారాల క్రితం కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని తెలిపింది. అయితే 21 రోజుల ఐసోలేషన్ తర్వాత శనివారం నాటి టెస్టుల్లో నెగిటివ్ గా వచ్చిందని తెలుపుతూ ఆమె ట్వీట్ చేసింది.
‘హాయ్.. నాకు మూడు వారాల క్రితం కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో గత 21 రోజులుగా నేను ఐసోలేషన్ లో ఉన్నాను. దేవుని దయతో ఈ రోజు నెగటివ్ గా వచ్చింది. అయితే ఐసోలేషన్ లో ఉన్న ఈ 21 రోజులు చాలా కష్టంగా గడిపాను. కరోనాతో పోరాడటం నాకు సవాలుగా మారింది. నా ఒంటరితనాన్ని సోషల్ మీడియా తగ్గించింది. ఇప్పుడు నేను నా కుటుంబంతో ఉన్నందుకు సంతోషంగా ఉంది. కరోనాను ఎదుర్కొవాలంటే.. ముందే పరీక్ష చేయించుకోవడం, మంచి ఆహారం తీసుకోవడం, ఆరోగ్యంగా ఉండటమే మార్గం’అని ఆమె తెలిపారు.
జెనీలియా డిసౌజా బాలీవుడ్ నటుడు రితీష్ దేశ్ ముఖ్ ను పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు రియాన్ మరియు రాహిల్ అనే ఇద్దరు కుమారులున్నారు. తుజే మేరీ కసం అనే హిందీ సినిమాతో 2003లో సినీపరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత ఆమె నటనను చూసి డైరక్టర్ శంకర్ బాయ్స్ సినిమాలోకి తీసుకున్నారు. ఆమె హిందీలో జానే తు యా జానే నా, తేరే నాల్ లవ్ హో గయా, ఫోర్స్ మరియు లై భారీ వంటి చిత్రాల్లో నటించి బాగా ప్రసిద్ది చెందింది. తెలుగులో సై, బొమ్మరిల్లు, సత్యం, ఢీ సినిమాలతో మంచి మార్కులు కొట్టేసింది.
— Genelia Deshmukh (@geneliad) August 29, 2020
For More News..