హలో ఎవ్రీవన్..కంగనా రనౌత్ రీఎంట్రీ

హలో ఎవ్రీవన్..కంగనా రనౌత్ రీఎంట్రీ

బాలీవుడ్‌ భామ  కంగనా రనౌత్‌ ట్విట్టర్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌లో ఆమె కమ్‌బ్యాక్‌ ట్వీట్‌ చేసింది. ఇందులో భాగంగా తన ట్వి్ట్టర్ ఫాలో వర్లను కంగనా పలుకరించింది. హలో ఎవ్రీవన్‌, ఇట్స్‌ నైస్‌ టు బి బ్యాక్‌ హియర్ అంటూ ట్వీట్ చేసింది. అయితే కంగనా ట్విట్టర్ అకౌంట్కు బ్లూ టిక్ లేకపోవడం గమనార్హం. అయితే ట్విట్టర్ కొత్త పాలసీ వల్లే బ్లూ మార్క్ పోయి ఉండొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

ట్విట్టర్లో తన నెక్ట్స్ ఫిల్మ్ ఎమెర్జెన్సీకి సంబంధించిన ఓ వీడియోను పంచుకుంది. బిహైండ్‌ ద సీన్స్‌ వీడియో ట్విటర్‌లో షేర్‌ చేసింది. ఎమర్జెన్సీ మూవీ పూర్తయ్యింది. 2023 అక్టోబర్‌ 20న థియేటర్లలో కలుద్దాం అని  క్యాప్షన్‌ ఇచ్చింది. 

2021 మే నెలలో ట్విటర్‌ కంగనా రనౌత్‌ ఖాతాను నిషేధించింది. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కంగనా మమతా బెనర్జి విజయానికి వ్యతిరేకంగా ట్వీట్స్ చేసింది. మమత ప్రభుత్వాన్ని పడగొట్టి..అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని కంగనా ట్విట్టర్లో  డిమాండ్‌ చేసింది. ఈ ట్వీట్స్ వివాదాస్పదం కావడంతో ట్విట్టర్ ఆమె ఖాతాను సస్పెండ్ చేసింది. తాజాగా మేనేజ్మెంట్ మారడంతో ఎలన్‌ మస్క్‌ కంగనా ట్విట్టర్ అకౌంట్పై  సస్పెన్షన్‌ను ఎత్తేశారు.