
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాను పెళ్లాడిన సంగతి తెలిసిందే. 2025 ఫిబ్రవరి నెలలో తన ప్రెగ్నెన్సీకి సంబంధించిన ప్రకటన అనంతరం కియారా మెట్ గాలా 2025లో మెరిసింది. న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో మెట్ గాలా (Met Gala) ఫ్యాషన్ ఈవెంట్ అట్టహాసంగా జరిగింది
ఈ సందర్భంగా మెట్ గాలా 2025 లో కియారా అద్వానీ తన బేబీ బంప్‌ను ప్రదర్శించింది. 'సూపర్‌ఫైన్: టైలరింగ్ బ్లాక్ స్టైల్' అనే థీమ్‌తో 2025 మెట్ గాలాలో ఈ సంవత్సరం కియారా ఎంట్రీ ఇచ్చింది. ప్రతిష్టాత్మకమైన ఈ ఫ్యాషన్ ఈవెంట్‌లో ఇలా బేబీ బంప్‌తో హాజరైన తొలి భారతీయ నటిగా చరిత్ర సృష్టించింది కియారా.
ఈ దుస్తులను ప్రముఖ ఇండియా సెలబ్రిటీ డిజైనర్ గౌరవ్ గుప్తా రూపొందించారు. కస్టమ్ కోచర్ డిజైన్‌లో కియారా దుస్తులు అలంకరించబడ్డాయి. బంగారు బ్రెస్ట్ ప్లేట్ గౌనులో కియారా చాలా అందంగా కనిపించింది. సాంస్కృతిక మూలాలను మరియు ఆమె వ్యక్తిగత స్వభావాన్ని సూచిస్తుంది.
►ALSO READ | Varun Tej-Lavanya Tripathi: తండ్రి కాబోతున్న మెగా హీరో వరుణ్ తేజ్..
మెట్ గాలాలో తన అరంగేట్రం గురించి కియారా స్పందిస్తూ.. “కళాకారిణిగా మరియు కాబోయే తల్లిగా నా అరంగేట్రం చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది.”అని చెబుతూ ఈ గౌనుకు “బ్రేవ్‌హార్ట్స్” అని క్యాప్షన్ ఇచ్చింది.
You did great, MAMA. ♥️#KiaraAdvani’s iconic MET Gala debut also marked her as the first Indian actress to walk the carpet with a baby bump.#Trending pic.twitter.com/OJs8Zk4UUE
— Filmfare (@filmfare) May 5, 2025
ఇకపోతే, డిజైనర్ గౌరవ్ గుప్తా కేవలం దుస్తుల డిజైన్ మాత్రమే కాకుండా, వేసుకున్న దుస్తులు కళలా అనిపించేలా, చక్కని శిల్పకళా రూపాలను సృష్టించడంలో ప్రసిద్ధి చెందాడు. ఇపుడు కియారా తన ప్రెగ్నెన్సీని బహిరంగంగా పంచుకునే ముందు దీనిని రూపొందించారు. కియారాకు ఇది ఒక రకమైన భావోద్వేగ క్షణంలా గుర్తుండిపోయేలా గౌరవ్ డిజైన్ చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సౌత్..నార్త్ అనే తేడా లేకుండా కియారా అద్వానీ ఆఫర్లు పట్టేస్తోంది. భరత్ అనే నేను, వినయ విధేయ రామ సినిమాలతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయింది. ఇటీవలే రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమాలో మెరిసింది.