బాలీవుడ్ నటి విద్యాబాలన్ కోలీవుడ్ ఎంట్రీకి రెడీ అయింది. సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్‌కు జంటగా ఆమె నటించబోతోంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘జైలర్ 2’లో విద్యాబాలన్ నటించబోతున్నట్టు తాజా సమాచారం. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది.
ఫస్ట్ పార్ట్‌లో ఉన్న నటీనటులు సీక్వెల్‌లోనూ కొనసాగనున్నారు. అయితే ఈ సారి విలన్‌గా బాలీవుడ్ స్టార్ మిథున్ చక్రవర్తి నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయనకు కూతురి పాత్రలో విద్యాబాలన్ కనిపించనుందట. సినిమాకు ఎంతో కీలకమైన ఈ ఇద్దరి పాత్రలను పవర్‌ఫుల్‌గా డిజైన్ చేశాడట నెల్సన్.
ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చెన్నై పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ నెలాఖరులో గోవాలో ఓ షెడ్యూల్‌కు ప్లాన్ చేస్తున్నారు. రెండు నెలల పాటు ఈ షెడ్యూల్ జరగనుంది. ఇక గతంలో అజిత్ సినిమా ‘నెర్కొండ పార్వై’లో అతిథి పాత్ర పోషించిన విద్యాబాలన్.. ఇప్పుడు పూర్తిస్థాయి పాత్రతో రజినీకాంత్‌కు జంటగా కనిపించనుందని సమాచారం. వచ్చే ఏడాది 2026 ఆగస్టులో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
అయితే బాలీవుడ్లో డర్టీ పిక్చర్ సినిమాతో బాగా పాపులర్ అయిన నటి విద్యాబాలన్ ఈమధ్య సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటోంది. ఈ క్రమంలో అప్పుడప్పుడూ తనకి సంబందించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ ఉంటోంది. ఇదే టైంలో తనదైన పాత్రలతో ఆడియన్స్ ను మెప్పిస్తూ వరుస అవకాశాలతో బిజీగా ఉంది. కెరీర్ మొదట్లో కమర్షియల్ గ్లామరస్ రోల్ చేసినా.. ఆ తర్వాత రూటు మార్చారు విద్యా బాలన్. పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ మూవీలు చేస్తున్నారు. ఇప్పుడు రజనీకాంత్ సినిమాలో నటించే అవకాశం ఆమెకు వచ్చింది. తెలుగులో బాలకృష్ణకు జంటగా 'NTR' బయోపిక్ చేశారు.
జైలర్ విషయానికి వస్తే.. 2023 ఆగస్టులో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్‍ను షేక్ చేసింది. సుమారు రూ.650 కోట్ల కలెక్షన్లను దక్కించుకుని రజనీకాంత్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఈ చిత్రంలో ముత్తువేల్ పాండియన్ పాత్రలో స్వాగ్, స్టైల్, యాక్షన్‍తో రజినీ దుమ్మురేపారు. ఇక ఇప్పుడు జైలర్ 2తో తలైవా ఎలాంటి మాస్ సంభవం క్రియేట్ చేయనున్నాడో చూడాలి!
