నా ఫస్ట్ ఛాయస్ అల్లు అర్జున్.. అదే నా కోరిక!

నా ఫస్ట్ ఛాయస్ అల్లు అర్జున్.. అదే నా కోరిక!

1నేనొక్కడినే(Nenokkadine) సినిమాతో పదేళ్ల క్రితం ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ కృతి సనన్‌(Krithi Sanon). ఈ అమ్మడు తెలుగు లో పెద్దగా క్రేజ్ దక్కించుకోలేక పోయింది. అయితే అదృష్టం బాగుండి బాలీవుడ్‌ నుంచి ఆఫర్లు వచ్చి, అక్కడ బడా స్టార్స్ కి జోడీగా నటించి స్టార్‌ హీరోయిన్ గా మారింది. ఆదిపురుష్(Adipurush) సినిమాలో ప్రభాస్(Prabhas) కు జోడీగా నటించిన కృతి సనన్ మళ్లీ తెలుగు సినిమాలో నటించాలని ఉందని చెబుతోంది.

ఇటీవల జాతీయ అవార్డును ఉత్తమ నటి కేటగిరీలో అందుకున్న కృతిసనన్‌ ఆ సమయంలో అల్లు అర్జున్‌ ను కలిసిందట. అప్పటి నుంచి ఆయనతో కలిసి నటించాలనే  కోరిక బలపడిందట. తాజాగా ఒక చిట్‌ చాట్‌ లో కృతి సనన్ మాట్లాడుతూ.. జాతీయ అవార్డుల ప్రధానోత్సవం సందర్భంగా మొదటి సారి అల్లు అర్జున్‌ ను కలిశాను. ఆయన గొప్ప మేధావి. ఆయన గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా అనిపించారు. అలాంటి నటుడితో కలిసి నటించాలని కోరుకుంటున్నా’ అని చెప్పింది.  ఎవరైనా దర్శకుడు తమ ఇద్దరి కోసం కథను తీసుకు వస్తే బాగుండు అని ఎదురు చూస్తున్నానంటోంది. ఆ చిట్ చాట్ లో కృతి సనన్ చెప్పిన మాటలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ముఖ్యంగా బన్నీ ఫ్యాన్స్‌ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెగ షేర్‌ చేస్తున్నారు.