
జాన్వీ కపూర్(Janhvi kapoor), వరుణ్ ధావన్(Varun dhavan)తో కలిసి నటించిన ‘బవాల్(Bavaal)’ సినిమా ఓటీటీలో విడుదలైంది. రెండో ప్రపంచ యుద్ధం వంటి చారిత్రక అంశాలతో పాటు వర్తమాన విషయాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. తాజాగా జాన్వీ కపూర్ బవాల్ గురించి మాట్లాడుతూ తనకు చరిత్రను పరిశోధించడమంటే ఎంతో ఇష్టమని పేర్కొంది.
‘స్కూల్లో నేను యావరేజ్ స్టూడెంట్‌నే. కానీ, హిస్టరీ సబ్జెక్ట్ అంటే చెవి కోసుకునేదాన్ని. ఈ సినిమా కోసం 'ఏ మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్' అనే బుక్ చదివాను. నాజీల క్యాంపుల్లో గడిపిన యూదులు కష్టాలను తెలుసుకున్నాను. భవిష్యత్తులోనూ చరిత్రకు సంబంధించిన అంశాల ఆధారంగా సినిమా చాన్స్ వస్తే అస్సలు వదులుకోను’ అంటూ వివరించింది. ప్రస్తుతం జాన్వీ కపూర్ జూనియర్ ఎన్టీఆర్(Jr NTR)తో ‘దేవర(Devara)’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.