ఆ డైరెక్టర్ కాఫీకి పిలిచి రూమ్ కి రమ్మన్నాడు: విద్యా బాలన్

ఆ డైరెక్టర్ కాఫీకి పిలిచి రూమ్ కి రమ్మన్నాడు: విద్యా బాలన్

బాలీవుడ్ నటి విద్యాబాలన్ ఓ టాప్ డైరెక్టర్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. తను క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినే అని చెప్పింది. ఓ డైరెక్టర్ తనతో సన్నిహితంగా ఉండి.. కాఫీకి రమ్మాన్నాడని, తర్వాత తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని తెలిపింది. రూమ్ కి పిలిచి తనపై హత్యాచారాని యత్నించాడని, తెలివిగా వ్యవహరించి ఆ డైరెక్టర్ బారి నుంచి తప్పించుకున్నానని వివరించింది. 

‘ఇండస్ట్రీలోకి వెళ్తానంటే.. చాలామంది అక్కడ పరిస్థితులు బాగుండవని కథలు కథలుగా చెప్పారు. నా తల్లిదండ్రులు కూడా ఆ మాటలు నమ్మి నన్ను సినీ ఇండస్ట్రీకి వెళ్తానంటే ఒప్పుకోలేదు. వాటికి మొదట భయపడ్డా. అదృష్టవశాత్తు క్యాస్టింగ్ కౌచ్ ఊబిలో చిక్కుకోలేదు. అయితే, ఆ డైరెక్టర్ తో జరిగిన సంఘటన ఇప్పటికీ మర్చిపోలేను. యాడ్ షూటింగ్ కోసం చెన్నై వెళ్లినప్పుడు ఓ డైరెక్టర్ వచ్చి నాతో సినిమా గురించి మాట్లాడాలి. కాఫీ షాప్ లో కలుద్దాం అని అన్నాడు. నిజం అని కాఫీకి వెళ్లా. అక్కడ కొంతసేపు మాట్లాడుకున్నాక, మిగతా విషయాలు రూమ్ కి వెళ్లి మాట్లాడుకుందాం అన్నాడు. ఒక్కదాన్నే ఉండటం వల్ల భయపడుతూ రూమ్ కి వెళ్లా. రూమ్ లోకి వెళ్లిన తర్వాత డోర్ క్లోజ్ చేయమన్నాడు. నేను తెలివిగా వ్యవహరించి గడి పెట్టలేదు. అది గమనించిన డైరెక్టర్ కు ఏం చేయాలో అర్థంకాక అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అలా నన్ను నేను రక్షించుకున్నా’అని విద్యాబాలన్ చెప్పింది.