సెకెండ్ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో విలన్‌‌‌‌‌‌‌‌గా బిజీ అవుతున్నారు

సెకెండ్ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో విలన్‌‌‌‌‌‌‌‌గా బిజీ అవుతున్నారు

బాలీవుడ్‌‌‌‌‌‌‌‌లో స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హీరోగా వెలిగిన సంజయ్‌‌‌‌‌‌‌‌ దత్.. సెకెండ్ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో విలన్‌‌‌‌‌‌‌‌గా బిజీ అవుతున్నారు. నార్త్‌‌‌‌‌‌‌‌లోనే కాదు.. సౌత్‌‌‌‌‌‌‌‌లో కూడా. ఆల్రెడీ హిందీలో అగ్నిపథ్, పానిపట్, షంషేరా లాంటి చిత్రాల్లో నెగిటివ్‌‌‌‌‌‌‌‌గా కనిపించిన దత్.. ‘కేజీయఫ్ 2’లో అధీరగానూ అదరగొట్టారు. ఈ చిత్రంలో ఆయన గెటప్, పర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫార్మెన్స్ చూసి అందరూ ఫిదా అయిపోయారు. దాంతో ఇప్పుడు మరో సౌత్‌‌‌‌‌‌‌‌ సినిమాకి ఆయన్ని విలన్‌‌‌‌‌‌‌‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. విజయ్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. ఇందులో సంజయ్ దత్ విలన్‌‌‌‌‌‌‌‌గా నటించబోతున్నారంటూ కోలీవుడ్‌‌‌‌‌‌‌‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

ప్యాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం ‘బాషా’ తరహాలో ఉంటుందట. విజయ్ గ్యాంగ్‌‌‌‌‌‌‌‌స్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కనిపిస్తాడట. చాలామంది విలన్స్ ఉంటారని, సంజయ్ దత్ మెయిన్ విలన్‌‌‌‌‌‌‌‌గా కనిపిస్తారని టాక్. లోకేష్ తీసిన ‘విక్రమ్’ మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో విజయ్ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సంజయ్ దత్‌‌‌‌‌‌‌‌ కూడా సినిమాకి యాడ్ అవుతున్నారంటే ఎక్స్‌‌‌‌‌‌‌‌పెక్టేషన్స్ మరింత పెరగడం ఖాయం.