Prabhas : 'రాజా సాబ్‌'లో బొమన్ ఇరానీ పాత్రే అసలైన ట్విస్ట్.. మారుతి రివీల్ చేసిన షాకింగ్ అప్‌డేట్!

Prabhas : 'రాజా సాబ్‌'లో బొమన్ ఇరానీ పాత్రే అసలైన ట్విస్ట్.. మారుతి రివీల్ చేసిన షాకింగ్ అప్‌డేట్!

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో వస్తున్న హారర్- కామెడీ థ్రిల్లర్ ‘ది రాజా సాబ్’ (The Raja Saab). అత్యంత భారీ అంచనాలతో తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా చిత్రం సంక్రాంతి బరిలోకి రెడీ అయింది.  ప్రభాస్ కెరీర్‌లో ఇప్పటివరకు చూడని సరికొత్త కోణాన్ని ఆవిష్కరించారు. ఈ సినిమాలో కేవలం ప్రభాస్ మేకోవర్ మాత్రమే కాదు, కథలో వచ్చే ట్విస్టులు కూడా ప్రేక్షకులను థ్రిల్ చేయనున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ దిగ్గజ నటుడు బొమన్ ఇరానీ పోషిస్తున్న పాత్ర ఈ సినిమాకు వెన్నెముక వంటిదని లేటెస్ట్ గా డైరెక్టర్ మారుతి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

కథను మలుపు తిప్పే పాత్ర

దర్శకుడు మారుతి ఇటీవల ఇచ్చిన అప్‌డేట్ ప్రకారం.. బొమన్ ఇరానీ ఈ చిత్రంలో ఒక సైకియాట్రిస్ట్ (Psychiatrist) పాత్రలో కనిపించబోతున్నారు. "సినిమాలో బొమన్ ఇరానీ గారి ఎంట్రీ తర్వాత కథా గమనం పూర్తిగా మారిపోతుంది. అప్పటివరకు హారర్-కామెడీగా సాగుతున్న సినిమా, ఆయన రాకతో ఎవరూ ఊహించని మలుపు తిరుగుతుంది. ఒక సీరియస్ టోన్ నుంచి అన్-ఇమాజినబుల్ థ్రిల్లింగ్‌లోకి కథ వెళ్తుంది" అని మారుతి పేర్కొన్నారు. కేవలం 15 నుండి 16 నిమిషాల నిడివి ఉన్నప్పటికీ, బొమన్ ఇరానీ పాత్ర ప్రేక్షకులను కట్టిపడేస్తుందని మారుతి ధీమా వ్యక్తం చేశారు.  కథ విన్న వెంటనే ఆయన ఆ పాత్రలో లీనమైపోయారని, తెలుగు, హిందీ భాషల్లో స్వయంగా డైలాగ్స్ చెప్పారని డైరెక్టర్ ప్రశంసించారు. ట్రైలర్‌లో చూసినట్లుగా ఆయన లుక్ చాలా డిఫరెంట్‌గా, ఆకట్టుకునేలా ఉండబోతోందని తెలిపారు.

 

భారీ తారాగణం..

ఈ చిత్రంలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరో ముఖ్య పాత్రలో వర్సటైల్ యాక్టర్ సంజయ్ దత్ కనిపిస్తుండటం సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ. థమన్ అందిస్తున్న సంగీతం, విజువల్ ఎఫెక్ట్స్ హారర్ ఎలిమెంట్స్‌ను సరికొత్త స్థాయిలో చూపించనున్నాయి. ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , ఐవీ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించారు.

►ALSO READ | Vijay Jana Nayagan: విజయ్ ‘జన నాయకుడు’ ట్రైలర్‌లో బ్లండర్.. ఏఐ (AI) లోగో చూసి నెటిజన్స్ ట్రోల్స్!

సంక్రాంతికి ‘రాజా’ వేట మొదలు! 

జనవరి 9, 2026న సంక్రాంతి కానుకగా ‘ది రాజా సాబ్’ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రభాస్ మార్క్ మాస్ ఎలిమెంట్స్, మారుతి మార్క్ కామెడీ,బొమన్ ఇరానీ వంటి నటుల పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌తో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ‘ది రాజా సాబ్’ కేవలం నవ్వులు, భయమే కాకుండా.. బొమన్ ఇరానీ పాత్ర ద్వారా ఒక బలమైన మైండ్ గేమ్, థ్రిల్లింగ్‌ను అందించబోతోందని స్పష్టమవుతోంది. మరి బాక్సీఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో చూడాలి.