సిరియాలో మిలటరీ బస్సుపై బాంబు దాడి: 14 మంది మృతి

V6 Velugu Posted on Oct 20, 2021

సిరియాలో బాంబు దాడి జరిగింది. రాజధాని డమస్కస్‌లో ఓ మిలిటరీ బస్సులో బాంబు పేలింది. ఈ పేలుడు ధాటికి 14  సిరియా సైనికులు మృతి చెందారు. జిసర్‌ అల్‌ రాయిస్‌ బ్రిడ్జ్‌ను బస్సు దాటుతుండగా.. రెండు బాంబులతో బస్సును పేల్చేసినట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో ఫైర్‌ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ పేలుడు ఘటనను పిరికిచర్యగా డమస్కస్‌ పోలీసు కమాండర్‌ మేజర్‌ జనరల్ హుస్సేన్‌ జుమా అన్నారు. బాంబు దాడికి పాల్పడింది తామే అని ఇంకా ఏ గ్రూప్‌ చెప్పలేదు. 

ఇడ్లిబ్‌ ప్రావిన్స్‌లోని అరిహ పట్టణంలో మరో దాడి జరిగింది. ఈ దాడిలో చనిపోయిన  10 మందిలో నలుగురు పిల్లలు, ఒక మహిళ ఉన్నారు. 

Tagged Bomb attack, Damascus, kills 14 Syrian, military personnel

Latest Videos

Subscribe Now

More News