ఢాకా: బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులే లక్ష్యంగా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. శనివారం కామిల్లా ప్రాంతంలో పూజా చేసుకుంటున్న హిందువుల బృందంపై గుర్తు తెలియని దుండగులు బాంబులు విసిరారు. దీంతో భయభ్రాంతులకు గురైన ప్రజలు ఉరుకులు, పరుగులు పెట్టారు. పూజా కార్యక్రమానికి హాజరైన పలువురు భక్తులు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. ప్రధాన అర్చకుడు కేశబ్ చక్రవర్తి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది
. ఈ ఘటనపై పోలీసులు కేసును నమోదు చేసుకున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. బంగ్లాదేశ్ విద్యార్థి నాయకుడు ఉస్మాన్ హాదీ హత్యతో ఆ దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అప్పటి నుంచి దేశంలోని హిందువులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.
