తమిళ్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు

V6 Velugu Posted on Jun 01, 2021

చెన్నై: తమిళ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి చెప్పడం కలకలం రేపింది. చెన్నై నగరంలోని తిరువాన్మియూరులో హీరో అజిత్ తన భార్య షాలిని, పిల్లలతో కలసి నివసిస్తున్నారు. మంగళవారం ఉదయమే అజిత్ కు ఫోన్ చేసిన గుర్తు తెలియని వ్యక్తులు నీ ఇంట్లో బాంబు పేలబోతోందని చెప్పారు. వెంటనే అజిత్ స్పందించి తన ఇంటికి ఫోన్ చేసి ఇంట్లో నుంచి బయటకు వచ్చేయండి.. బాంబు పేలబోతోందట అని చెప్పారు. దీంతో ఇంట్లో ఉన్న భార్యా పిల్లలతో పాటు పని మనుషులు కూడా ఇంట్లో నుంచి హుటాహుటిన బయటకు వెల్లి దూరంగా నిలబడ్డారు. ఇంతలో అజిత్ నుంచి ఫోన్ కాల్ అందుకున్న పోలీసులు బాంబ్ స్క్వాడ్ బలగాలు, జాగిలాలతో అజిత్ ఇంటికి వచ్చారు. అజిత్ కుటుంబ సభ్యులను ఇంటికి దూరంగా ఉండమని చెప్పి తనిఖీలు చేపట్టారు. బాంబ్ స్క్వాడ్ ఇల్లంతా అణువణువునా మెటల్ డిక్టేటర్లు, జాగిలాలతో గాలించినా ఎక్కడా లేదని తేలింది. దీంతో ఫేక్ కాల్ గా భావించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 
హీరో అజిత్ కు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ రావడం ఇది రెండోసారి. గత ఏడాదిలో కూడా ఇలానే ఒక అకతాయి ఫోన్ చేసి ఇంట్లో బాంబు పేలబోతోందని చెబితే భయపడి పోలీసులతో తనిఖీ చేయించారు. ఎక్కడా బాంబు ఆనవాళ్లు కనిపించకపోవడంతో ఫేక్ కాల్ గా గుర్తించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా 24 గంటల్లోనే ఫోన్ కాల్ చేసిన ఆకతాయిని పట్టుకుని అరెస్టు చేశారు. ఇప్పుడు కూడా గత ఏడాదిలానే ఆకతాయిలు ఫోన్ చేసి బెదిరించడంతో అజిత్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. 
మినిమం రిటర్న్ హీరోగా.. సీనియర్ నటుడిగా ఉన్న అజిత్ కెరీర్ లో మంచి పొజిషన్ లో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం ‘వాలిమై’ సినిమా షూటింగ్ జరుగుతోంది. మరికొన్ని సినిమాలకు కిట్ అయినా కరోనా లాక్ డౌన్ కారణంగా షూటింగులు ఏవీ జరగడం లేదు. ఈ పరిస్థితుల్లో ఆకతాయిలు ఫోన్ చేసి ఆటపట్టించడంతో హీరో అజిత్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. ఎవరో ఉద్దేశ పూర్వకంగానే తన నెంబర్ ను ఆకతాయిలకు చేరవేసి ఇలాంటి పనులు చేయిస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. 

Tagged , chennai today, kolywood today updates, bomb blast threat, tamil hero ajith kumar, actor ajith, tamil actor ajith

Latest Videos

Subscribe Now

More News