విజయవాడలో బాంబు కలకలం... ఎల్ఐసీ బిల్డింగ్ ను పేల్చేస్తామంటూ ఫోన్‌కాల్‌

విజయవాడలో బాంబు కలకలం... ఎల్ఐసీ బిల్డింగ్ ను పేల్చేస్తామంటూ ఫోన్‌కాల్‌

విజయవాడలో బాంబు బెదిరింపులు కలకలం రేపింది. శనివారం ( మే 24 ) విజయవాడ బీసెంట్ రోడ్డులోని ఎల్ఐసీ భవనానికి బాంబు బెదిరింపుల ఫోన్ కాల్ వచ్చినట్లు సమాచారం. గుర్తు తెలియని వ్యక్తి కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి బీసెంట్ రోడ్డులో బాంబు పెట్టామని చెప్పడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. రద్దీగా ఉండే ప్రాంతం కావడంతో వెంటనే బీసెంట్ రోడ్డు ప్రాంతంలో హైఅలర్ట్ ప్రకటించారు పోలీసులు.

బాంబు బెదిరింపుల ఫోన్ కాల్ తో అప్రమత్తమైన పోలీసులు.. బీసెంట్ రోడ్డులో షాపులన్నింటినీ మూసి వేయించారు. బాంబు స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు పోలీసులు . బాంబు బెదిరింపు వార్తలతో బీసెంట్ రోడ్డు వాసులంతా భయాందోళన గురయ్యారు. కాగా బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి డీటెయిల్స్ కోసం ఆరా తీస్తున్నారు పోలీసులు. ఈ సంఘటన గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.