ఏడు స్కూళ్లకు బాంబు బెదిరింపు

ఏడు స్కూళ్లకు బాంబు బెదిరింపు

బాంబు బెదింపులతో బెంగళూరు సిటీ ఉలిక్కి పడింది. ఒకేసారి 7 స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆయా స్కూళ్లకు చేరుకున్నారు. బాంబు స్క్వాడ్ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. మహదేవపురలోని ఒపలాన్ ఇంటర్నేషనల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, న్యూ అకాడమీ స్కూల్, సెయింట్ విన్సెంట్ పాల్ స్కూల్, హెన్నూర్ అండ్ ఇండియన్ పబ్లిక్ స్కూళ్లు బాంబు బెదిరింపు వచ్చిన స్కూళ్ల లిస్టులో ఉన్నాయి. 

బాంబు బెందిరింపు మెయిల్ వచ్చిన సమయంలో స్కూళ్లలో ఎగ్జామ్ జరుగుతోంది. దీంతో స్టూడెంట్స్ అందరినీ బయటకు పంపి తనిఖీలు నిర్వహించారు. అయితే ఏ స్కూల్ లోనూ పేలుడు పదార్థాలు లభించలేదు. దీంతో అది ఫేక్ మెయిల్ అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. స్కూళ్లకు బెదిరింపు మెయిల్స్ రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ జరుపుతున్నారు.