8 సంస్థలకు బాంబు బెదిరింపు మెయిల్.. కేసు నమోదు

8 సంస్థలకు బాంబు బెదిరింపు మెయిల్.. కేసు నమోదు

ముంబైలోని దాదాపు ఎనిమిది సంస్థలకు, కొలాబాలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ మ్యూజియం, వర్లీలోని నెహ్రూ సైన్స్ సెంటర్‌కు బాంబు పేలుళ్ల బెదిరింపు మెయిల్‌లు వచ్చాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మ్యూజియంకు మొదటి మెయిల్ వచ్చింది. ఇతర సంస్థలకు కూడా ఇలాంటి మెయిలే రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

బైకుల్లా జూపై దాడి చేస్తామని మెయిల్‌ లో చెప్పడంతో.. నగరంలోని ముఖ్యమైన ప్రదేశాల వద్ద భద్రతను పెంచారు. పోలీసులు బాంబు డిటెక్షన్, డిస్పోజల్ స్క్వాడ్‌లతో పాటు మెయిల్‌లలో పేర్కొన్న ప్రదేశాలను తనిఖీ చేసినప్పటికీ ఏమీ లభ్యం కాలేదు. మ్యూజియం యాజమాన్యం దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా, కొలాబా పోలీస్ స్టేషన్‌లో గుర్తుతెలియని వ్యక్తులపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదైంది.