తమిళనాడులోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపు మెయిల్స్..

తమిళనాడులోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపు మెయిల్స్..

తమిళనాడులో సోమవారం నాడు రెండు పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో విద్యార్థులు, సిబ్బంది, తల్లిదండ్రుల్లో భయాందోళన నెలకొంది. వివరాల్లోకి వెళితే  కోయంబత్తూర్‌లోని పీఎస్‌బీబీ మిలీనియం స్కూల్, కాంచీపురం జిల్లాలోని ఒక ప్రైవేట్ పాఠశాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. కోయంబత్తూరులోని పీఎస్‌బీబీ మిలీనియం స్కూల్‌కు ఆదివారం రాత్రి బాంబు బెదిరింపు ఇమెయిల్, కాంచీపురంలోని పాఠశాలకు సోమవారం ఉదయం కాల్‌లో ఇలాంటి బెదిరింపు వచ్చాయి.

 స్కూల్‌లో బాంబు పెట్టినట్లు తమకు బెదిరింపు ఇమెయిల్ వచ్చిందని స్కూల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చారు. కోయంబత్తూరులోని పీఎస్‌బీబీ మిలీనియం స్కూల్‌కు బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌లతో పాటు పోలీసు సిబ్బంది చేరుకుని క్షుణ్నంగా తనిఖీ చేశారు. 

 కాంచీపురం పాఠశాలకు వచ్చిన బెదిరింపు కాల్ బూటకపు కాల్ అని పోలీసులు తెలిపారు. ఈమెయిల్ మరియు కాల్స్ రావడంపై కేసు నమోదు చేసుకున్నామని విచారణ చేపడుతున్నామని తెలిపారు. రెండు నగరాల్లోని పాఠశాలల చుట్టూ భద్రతను పెంచారు.