Ravva Receipe : లడ్డూలు .. కేసరి .. ఇలా తయారు చేసుకోండి.. రుచి అదిరిపోద్ది..!

Ravva Receipe  :   లడ్డూలు .. కేసరి .. ఇలా తయారు చేసుకోండి.. రుచి అదిరిపోద్ది..!

ఉప్మారవ్వతో... అదేనండి బొంబాయి రవ్వతో ఉప్మా చేసుకుని తినడమే కాదు.. రకరకాల వెరైటీ వంటకాలు చేసుకోవచ్చు. కేసరితో పాటు   లడ్డూ లు చాలా  రుచిగా చేసుకుని లాగించొచ్చు.. ఇప్పుడు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.  .! 

బొంబాయి రవ్వతో లడ్డూలు తయారీకి కావలసినవి

  • ఉప్మా (బొంబాయి- కప్పు) : 1 కప్పు
  • కొబ్బరి తురుము: 2 కప్పులు
  • బెల్లం పొడి ఒకటిన్నర కప్పులు.
  • నీళ్లు రెండున్నర కప్పులు
  • యాలకులు: 4
  • నెయ్యి : 2 టీ స్పూన్లు
  • సాల్ట్​: కావలసినంత

తయారీ విధానం:  పొయ్యి మీద బాండీ పెట్టి కొబ్బరి తురుము..బెల్లం వేసి బెల్లం కరిగి దగ్గరయ్యేంత వరకు ఉడికించాలి. తరువాత ఒక పాన్ తీసుకొని నీళ్లు పోసి అందులో కొంచెం నూనె, చిటికెడు ఉప్పు వేసి గరిటతో బాగా కలపాలి. నీళ్లు మరుగుతుండగా రవ్వ వేసి ఉండలు కట్టకుండా కలపాలి. సన్నని మంటమీద రవ్వ మరీ గట్టిగా కాకుండా 5 నుంచి 6 నిమిషాలు ఉడికించాలి. రవ్వ చెల్లారాక మెత్తగా చపాతి పిండిలా చేత్తో కలపాలి. వాటిని చిన్న చపాతీల్లా చేయాలి. ఇందులో కొబ్బరి మిశ్రమాన్ని పెట్టి పిండితో మోదక్​ల ఆకారం వచ్చేలా చేయాలి


బొంబాయి రవ్వతో కేసరి తయారీకి  కావలసినవి

  • ఉప్మా (బొంబాయి) రవ్వ: 1  కప్పు
  • చక్కెర : 1  కప్పు
  • నీళ్లు లేదా పాలు: 2 1/2 కప్పు
  • కుంకుమపువ్వు చిటికెడు
  • ఆరంజ్ ఫుడ్ కలర్ :2లేదా 3 చుక్కలు
  • నెయ్యి :6 టేబుల్ స్పూన్లు
  • జీడిపప్పు :7
  • ఎండుద్రాక్ష : 10
  • యాలకుల పొడి: చిటికెడు

తయారీ విధానం : ఒక పెద్ద బాండీలో నెయ్యి వేడి చేయాలి.. సన్నని మంటమీద జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసి వేగించాలి. తరువాత అందులోనే రవ్వ వేసి పచ్చి వాసన పోయేలా వేగించాలి. ఒక కప్పురవ్వకి 3/4 చక్కెర తీసుకోవాలి.  పొయ్యి మీద బాండీ పెట్టి రెండున్నర కప్పుల నీళ్లు  పోసి అందులో చక్కెర వేయాలి. చక్కెర కరిగాక కొంచెం కుంకుమ పువ్వు, ఆరంజ్ పుడ్​కలర్, యాలకుల పొడి చిటికెడు వేసి సన్నని మంట మీద మరిగించాలి. అది మరిగాక వేగించిన రవ్వ వేసి ఉండలు కట్టకుండా బాగా కలపాలి. రవ్వదగ్గరకు అయ్యేలా కలిపి తరువాత ముందుగా జీడిపప్పు ఎండుద్రాక్షను వేసి పై నుంచి వేడి చేసిన నెయ్యి వేసి కలపాలి.